BREAKING : టీడీపీలోకి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరడం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం చంద్రబాబుతో బేటీ కానున్న ఆయన ఈనెల 21న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న వైసీపీ ప్రకటించిన లిస్టులో పెనమలూరు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన… సైకిల్ ఎక్కాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అటు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి కూడా వైసీపీని వీడతారనే ప్రచారం నడుస్తోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కాపునేత ముద్రగడ పద్మనాభం వచ్చేవారం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేనకు చెందిన పలువురు కాపు నేతలు ముద్రగడతో వరుసగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కు ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆయన ఇచ్చినట్లు సమాచారం. ఆ లేఖ పవన్ కు చేరిన అనంతరం జనసేనలో ముద్రగడ చేరికపై, వారిద్దరి భేటీపై స్పష్టత రానుంది.