సంక్రాంతి ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తిని తెలియజేస్తోంది : మోదీ

-

దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. సంవత్సరమంతా చదువులు, ఉద్యోగాలు, ఉపాధి పేరుతో కుటుంబానికి దూరంగా ఉండే వారంతా ఈ పండుగపూట సొంతూళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ, వ్యాపార, ఇతర ప్రముఖులు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దేశ ప్రజలకు సంక్రాంతి విషెస్ చెప్పారు.

దిల్లీలోని కేంద్ర పశుసంవర్థక సహాయ మంత్రి ఎల్ . మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకలకు పుదుచ్చేరి, తెలంగాణ గవర్నర్ తమిళసై, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , సినీ నటి మీనా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు మకర సంక్రాంతి, మాగ్ బీహు శుభాకాంక్షలు తెలిపారు. పొంగల్ పండుగ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తిని తెలియజేస్తోందని అన్నారు. ఈ ఐక్యత 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించాలన్న సంకల్పానికి బలాన్నిస్తుందని తెలిపారు. మరోవైపు దేశంలో మూడు కోట్ల మందికి పైగా రైతులు తృణధాన్యాలను పండిచారని, ఆ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే అన్నదాతలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news