కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఊడ్చిన కిషన్ రెడ్డి..సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు
బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయ పరిసరాల్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేసారు, నీటితో ఆలయ గోపురాల్ని కడిగారు. అనంతరం తన స్వహస్తాలతో స్వయంగా విగ్రహ మూర్తుల్ని శుద్ధి చేశారు. కాగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పీఎం మోదీ చేతుల మీదుగా జరగనుందని రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే వ్యక్తిగత, భద్రత కారణాల రీత్యా మోదీ ఆరు రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది. ఆయనకు బదులుగా 16-21 వరకు జరిగే అన్ని పూజల్లో ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా దంపతులు పాల్గొంటారని వివరించింది. 22న మోదీ రాముడి విగ్రహానికి ఉన్న కళ్లగంతలు విప్పి, హారతి ఇస్తారని ట్రస్ట్ వెల్లడించింది.
https://x.com/TeluguScribe/status/1747508852290207841?s=20