ఫిబ్రవరి తెలంగాణలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ నల్గొండ పట్టణంలో రోడ్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి నిరు పేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. UPSC తరహాలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామని.. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందిస్తామని వెల్లడించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇచ్చే అంశంపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి.