లోక్సభ ఎన్నికల వేళ జిల్లా అధ్యక్షులను మార్చిన బీజేపీ.. కొత్త టీమ్ ఇదే

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించిన వారిని కాస్త దూరం పెట్టే యోచన చేసింది. ఈ క్రమంలోనే శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో పాటు పనితీరు బాగాలేని జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 35 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది.

 

పార్లమెంటు ఎన్నికల్లో 10 ఎంపీ సీట్లు, 35శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ ప్రస్తుతం కొనసాగుతున్న చాలా మంది జిల్లా అధ్యక్షులకు మరోసారి అవకాశం కల్పించింది. మూడు జిల్లాలు అదిలాబాద్, మహబూబ్ బాద్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జిల్లా అధ్యక్షులతో పాటు పలు మోర్చా అధ్యక్షులను కూడా మార్చారు.

కిషన్‌రెడ్డి కొత్త జట్టు ఇదే

వికారాబాద్‌                       –        మాధవరెడ్డి
యాదాద్రి భువనగిరి         –        భాస్కర్
నిజామాబాద్‌                     –       దినేశ్‌
సిద్దిపేట                           –        మోహన్‌రెడ్డి
జనగామ                         –        దశమంతరెడ్డి
హనుమకొండ                 –        రావు పద్మ
కామారెడ్డి                        –        అరుణతార
కరీంనగర్                        –        కృష్ణారెడ్డి
జగిత్యాల                        –        పైడిపల్లి సత్యనారాయణరావు
ఖమ్మం                           –       గల్లా సత్యనారాయణ
మేడ్చల్ అర్బన్               –       పన్నాల హరీశ్‌రెడ్డి
మేడ్చల్ రూరల్               –       విక్రమ్‌రెడ్డి
హైదరాబాద్ సెంట్రల్         –       గౌతమ్ రావు

ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్యాణ్‌ నాయక్‌
ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కొండేటి శ్రీధర్‌
యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవెల్లా మహేందర్
ఓబీసీ మోర్చా  రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద్‌గౌడ్
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్ప
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దోళ్ల గంగారెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news