మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్… 24 గంటల్లో బలపరీక్షను ఎదుర్కొని, మెజార్టీని నిరూపించుకోవాలని ఆదేశించింది. రాజ్ భవన్ మెజార్టీని నిర్ణయించలేదని తెలిపింది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని… శాసనసభలోనే బలపరీక్ష జరగాలని ఆదేశించింది.
ఫడ్నవిస్ ప్రభుత్వానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉందా? అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.