అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు నిత్యానంద!

-

అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొద్ది క్షణాలే మిగులున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే వేల మంది అతిథులకు ఆహ్వానం అందింది. ఆహ్వానం అందిన దాదాపు చాలా మంది ఈ వేడుకకు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో రామయ్య ప్రాణప్రతిష్ఠకు తనకూ ఆహ్వానం అందిందని తనను తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.

‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహన అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. కారు డ్రైవర్‌ ఫిర్యాదుతో ఆయణ్ను పోలీసులు అరెస్ట్‌ చేయగా ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిత్యానంద 2020లో దేశం నుంచి పారిపోయాడు. ఒక దీవిని ఏర్పరుచుకుని దానికి ‘కైలాస’ దేశంగా పేరు పెట్టి తనను తాను హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news