అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రణాళిక ఏంటంటే?

-

యావత్ భారతావని ఎన్నో ఏళ్ల నుంచి వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఘట్టం మరికొద్ది క్షణాల్లో ఆవిష్కృతం కానుంది. అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడు ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు తొలిపూజను అందుకోనున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రణాళిక ఏంటనే విషయంపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా స్పందించారు.

జనవరి 23వ తేదీ నుంచే మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెడతామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. 2024 ముగిసేసరికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో మరో ఏడు ఉపాలయాలు నిర్మించాల్సి ఉందన్న ఆయన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత వీటిని చేపడతామని వివరించారు. యావత్‌ దేశానికి ఇచ్చిన హామీని నెరవేర్చేలా నేటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

జనవరి 16న మొదలైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు .. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠతో ఇవాళ (జనవరి 22న) మధ్యాహ్నం 12.30కు ఒంటి గంటకు పూర్తవుతాయి. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. జనవరి 23వ తేదీ నుంచి సాధారణ భక్తుల దర్శనాలకు అనుమతించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news