పది రోజులు వీఐపీలకు నో ఎంట్రీ.. రామ మందిరం దర్శనంలో మార్పు..!

-

అయోధ్య రామ మందిరానికి ఏకంగా లక్షల్లో భక్తులు వెళుతున్నారు. రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్యకి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. జనాలని అదుపు చేయడం భద్రతా బలగాలికి పెద్ద సవాల్ అయిపోయింది. తొలిరోజైన మంగళవారం రద్దీ ఎక్కువ ఉండడం వలన దర్శనాన్ని కొంత సేపు ఆపేశారు. ఈరోజు కూడా పరిస్థితి అలానే ఉంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా క్షణక్షణం అప్డేట్స్ ని తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ ఏడిసి ప్రశాంత్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ ప్రసాద్ స్వయంగా రామ మందిరంలో ఏర్పాట్లను చూస్తున్నారు.

అయితే భక్తులు ఎక్కువమంది వస్తుండడంతో రానున్న పది రోజులు పాటు విఐపి లు అయోధ్యకి రావద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రద్దీ ఎక్కువ ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కూడా పొడిగించారు ఉదయం 7 నుండి రాత్రి 11 గంటల వరకు రామ్ లల్లా దర్శనం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు నిన్న ఒక్కరోజులోనే అయోధ్యకి ఐదు లక్షల మంది వచ్చారు రాము లల్ల దర్శనం కోసం అయోధ్యకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజులు ఇక్కడికి వచ్చే అన్ని వాహనాలపై నిషేధం విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news