నేటి నుంచి ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు

-

హైదరాబాద్‌ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇవాళ భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌కు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. నాలుగు రోజులుగా ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. స్టేడియంని అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముస్తాబు చేసింది. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతి కలిగేలా సీటింగ్, రూప్ టాప్స్, స్కోర్ బోర్డ్స్‌ను ఏర్పాటు చేసింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.

306 సీసీ కెమెరాలు, 15వందల మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు కల్పిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియం లోపలికి ల్యాప్ ట్యాప్, బ్యాగ్స్, లైటర్స్, బ్యానర్స్, పవర్ బ్యాంగ్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్‌, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని నిర్వాహకులు వెల్లడించారు. ఐదోరోజుల పాటు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐదు వేల మందికి ఉచిత ప్రవేశంతో పాటు భోజన వసతి కల్పిస్తోంది. మ్యాచ్‌కు వచ్చే క్రికెట్‌ అభిమానుల కోసం ఆర్టీసీ నగరం నలుమూలల నుంచి ఉప్పల్‌కు 60 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news