రవితేజ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వెన్యూ ఫిక్స్‌…

-

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఈగల్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. కావ్య థాపర్ ,మధుబాల ,నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 9న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జనవరి 26న రవితేజ పుట్టినరోజు.దీంతో మాస్ మహారాజా బర్త్‌ డే వేడుకలను ఈగల్‌ చిత్ర బృందం యూసుఫ్‌గూడ మహమూద్ హౌస్ గ్రాండ్ గార్డెన్ లో ఉదయం 10 గంటల నుంచి ఈవెంట్ నిర్వహించనున్నారు. రేపు మూడో సాంగ్‌ ఈగిల్ ఆన్ ది వే కూడా లాంఛ్ చేయనున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్‌ పోస్టర్లు, ట్రైలర్‌ అప్‌డేట్ లుక్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. అయితే సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో బడా హీరోల చిత్రాలు విడుదల కావడంతో సంక్రాంతి బరిలో నుంచి ఈ చిత్రం తప్పుకున్న విషయం మనకు తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news