ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత్ వచ్చేశారు. ఆయన ఫ్రాన్స్ నుంచి నేరుగా జైపూర్ కు చేరుకున్నారు. రేపు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు మేక్రాన్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. ఇవాళ జైపూర్లోని అంబర్ కోటను ఆయన సందర్శిస్తారు. అనంతరం జంతర్ మంతర్ టూర్లో ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత రాంబాగ్ ప్యాలెస్లో ప్రత్యేక విందుకు హాజరవుతారు. అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు.
రిపబ్లిక్ డే వేడుకలకు ఇండియా వస్తున్న ఆరో అధ్యక్షుడిగా మాక్రాన్ నిలవనున్నారు. గతంలో ఫ్రెంచ్ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్ (1980),జాక్వెస్ చిరాక్ (1998),నికోలస్ సర్కోజీ (2008),ఫ్రాంకోయిస్ హోలాండ్ (2016)లు దేశానికి వచ్చారు. కాగా, మాక్రాన్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాతో రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికతోపాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగనున్నట్లు సమాచారం.