Animal OTT Release : OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ..ఎందులో అంటే

-

Animal OTT Release : OTTలోకి సూపర్ హిట్ మూవీ యానిమల్‌ వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. బాబి డియో అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 900 కోట్ల భారీ వసూళ్లను సాధించి.. ప్రస్తుతం 1000కోట్ల వసూళ్ళ వైపు పరిగెడుతుంది. ఇక ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీ లో విడుదలవుతుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

AnimalOnNetflix

ఈ తరుణంలోనే.. యానిమల్ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా రిపబ్లిక్ డే కానుకగా నిన్న రాత్రి 12 గంటల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. మ‌రోవైపు ఈ చిత్రం ఓటీటీ వెర్ష‌న్‌కు 20 నిమిషాలు జ‌త చేయ‌నున్న‌ట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్ర‌క‌టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news