HanuMan : ‘హనుమాన్’ కు 250 కోట్లు..RRR రికార్డులు బ్రేక్ !

-

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ మూవీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.

HANUMAN collects 250 CRORES Worldwide in just 15 Days

అయితే, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ అరుదైన ఫీట్ ను నమోదు చేసింది. 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజ్ లు లేకపోవడంతో త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్ కు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news