సెకండాఫ్‌ బాలేదంటే ఫోన్‌ పెట్టేశాడు.. లియో డైరెక్టర్ పై విజయ్ తండ్రి కామెంట్స్

-

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఓ డైరెక్టర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలో సెకండాఫ్ బాలేదని చెబితే అతడు ఫోన్ కట్ చేశాడని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రశేఖర్ .. లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించే అన్నారని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

విజయ్‌ దగ్గరకు వచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా ఒక అభిమానిగా వింటానని చంద్రశేఖర్ అన్నారు. వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి నివృత్తి చేసుకుంటానని చెప్పారు. మరో ఐదు రోజుల్లో రిలీజ్‌ అనగా విజయ్ సినిమా చూసి వెంటనే దర్శకుడికి ఫోన్‌ చేసి ఫస్టాఫ్ బాగుంది..సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు అంతగా బాలేవని చెప్పానని తెలిపారు. ముఖ్యంగా తండ్రి తన సొంత కొడుకునే చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పానన్న చంద్రశేఖర్.. తన మాటలకు అతడు.. ‘సర్‌, భోజనం చేస్తున్నా. మళ్లీ కాల్‌ చేస్తా’ అని ఫోన్‌ పెట్టేసి ఆ తర్వాత కాల్‌ చేయలేదని వెల్లడించారు. చంద్రశేఖర్ కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన మాట్లాడుతున్నది ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ను ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news