రాహుల్ గాంధీకి బాడీ డబుల్.. త్వరలో బయటపెడుతా : సీఎం హిమంత

-

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీm అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జూడో న్యాయ్ యాత్ర జరిగిన సందర్భంలో ఆయనకు తీవ్ర అడ్డంకులు ఏదైనా విషయం తెలిసిందే. రాహుల్ యాత్రను అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో అస్సాంలో అంశాల నడుమ భారత్ జోడో న్యాయ యాత్ర సాగింది. సమయంలో సీఎం హిమంత విశ్వశర్మ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలను గుర్తించారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం విశ్వశర్మ అని రాహుల్ ఘాటైన విమర్శలు చేశారు.

రాహుల్ వ్యాఖ్యలకు దీటుగా సీఎం హిమంత సైతం కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాడని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీఎం హిమంత రాష్ట్ర డిజిపిని ఆదేశించారు. ఇదిలా ఉండగా మరోసారి రాహుల్ గాంధీ పై హిమంతా విశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ భాడీ డబల్ ఉపయోగిస్తున్నాడని సీఎం ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేది రాహుల్ కాదని.. ఆయన భాడీ డబుల్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. యాత్ర సమయంలో బస్సులో కూర్చుని ప్రజలకు అభివాదం చేసేది రాహుల్ కాదన్నారు. త్వరలోనే రాహుల్ గాంధీ బాడీ డబుల్, అసలు పేరు వివరాలను బయటపెడతామన్నారు. సినిమాల్లో కనిపించే భాడీ డబుల్ క్యారెక్టర్ ను రాహుల్ గాంధీ ఉపయోగిస్తున్నాడని ఏకంగా ఒక రాష్ట్ర సీఎం కామెంట్స్ చేయడం ఇప్పుడు పాలిటిక్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news