కోదండరాం మీద కేసీఆర్ కుట్రలు చేసారంటూ….ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచింది జనసమితి పార్టీ. ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపి వేసింది. గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీల నియామకాల పై ఇది వరకే తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత దాకా కూడా ఎమ్మెల్సీల నియామకం ఆపాలని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
కుర్రా సత్యనారాయణ కూడా పిటీషన్ వేశారు. ఈ విషయం పై హైకోర్టు విచారణ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపి వేసింది. వచ్చే నెల 8 వరకు యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేషించింది. రాజకీయ నేపథ్యం ఉన్నవారిని ఎమ్మెల్సీ కేబినెట్ సిఫార్సులను పక్కన తిరస్కరించింది గవర్నర్. కోదండరాం రాజకీయ నేపథ్యం పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కు పిలుపునిచ్చింది.