మాజీ సర్పంచులకు కేటీఆర్ సందేశం..!

-

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచులకి పదవి కాలం ముగిసింది ఈరోజు నుండి అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సర్పంచులు మాత్రం ఎన్నికల షెడ్యూలు వచ్చేవరకు తమనే పదవిలో ఉంచాలని కోరుతున్నారు. లేకపోతే పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కొనసాగింపు ఉండదని అంది.

మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సందేశం పంపించారు సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ ప్రజాసేవకే కాదని చెప్పారు ఐదేళ్ల కాలం పాటు తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసిన సర్పంచుల పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు నెలకొల్పడంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో సర్పంచులు పాత్ర ఎనలేనిది అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news