Vijay : ఎంజీఆర్ తరహాలో నటుడు విజయ్ ఫోటో

-

తమిళనాడు మాజీ సీఎం ఎంజిఆర్ తరహాలో నటుడు విజయ్ ఫోటోను మార్చి రూపొందించిన పోస్టర్లు మధురైలో కలకలం రేపుతున్నాయి. ఆయన భార్యను సైతం జయలలితలా చూపిస్తూ పోస్టర్లో చేర్చారు. ‘మేము చూసిన విప్లవ నాయకుడు, విప్లవ నాయకురాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ త్వరలో రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయనున్నట్లు సమాచారం.

Star hero Vijay’s MGR Posters Creating Huge Controversy

రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేస్తున్న విజయ్‌ 2026లో జరిగే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా విజయ్‌ మక్కల్‌ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయ్యారు. తాజాగా చెన్నై శివారు పనైయూర్‌లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ పేరుపై ఆయన ఎక్కువసేపు నిర్వాహకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news