బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానికీ భారత రత్న అవార్డు లభించింది. అద్వానికి అభినందనలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత L.K. అద్వానికి భారత రత్న అవార్డు రావడం హర్శించదగ్గ విషయం అన్నారు. దేశ అభి ద్ధిలో అద్వానీ పాత్ర చాలా కీలకం అన్నారు. అందుకే ఆయనకు భారత రత్న అవార్డు లభించిందని తెలిపారు.
దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసి, కంగ్రాట్స్ చెప్పినట్లు పీఎం నరేంద్ర మోడీ తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని.. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదని కొనియాడారు ప్రధాని.