ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం… 500 రూపాయలకే సిలిండర్ పై ప్రకటన !

-

తెలంగాణ కేబినేట్‌ సమావేశానికి ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా ఉచిత కరెంట్, రూ.500 సిలిండర్‌ పథకాలపై చర్చించనుంది కేబినేట్‌. అలాగే… బడ్జెట్ సమావేశాలపై ఇవాళ్టి తెలంగాణ కేబినేట్‌ సమావేశంలో చర్చించనున్నారు.

ఇక ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు మొదలు కానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ నెల 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news