అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్‌కు తొలి విజయం

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మొన్నటిదాక రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస విజయాలు నమోదు చేశారు. ఇక తాజాగా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్  తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో  బైడెన్ ఘన విజయం సాధించారు.

మిన్నెసొటా ప్రతినిధి డీన్‌ ఫిలిప్స్‌, రచయిత మెరియన్ విలియమ్సన్‌పై బైడెన్ గెలుపొందారు. 2020లో అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని బైడెన్‌ అన్నారు. 2024లోనూ అదే పునరావృతం అవుతుందని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

మరోవైపు దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకూ మంచి పట్టుంది. ఇక్కడి ఓటర్లలో 26 శాతం నల్లజాతీయులే. దేశం మొత్తం ఓటర్లలో వీరి వాటా 11 శాతం.  గత ఎన్నికల్లో ప్రతి 10 మంది నల్లజాతీయుల్లో 9 మంది బైడెన్‌కు ఓటేశారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news