మేడారం జాతర వెళ్లేవారికి అలర్ట్.. ఆధార్ తప్పనిసరి !

-

మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. మేడారంలో ఎత్తు బంగారాన్ని (బెల్లం) కొనుగోలు చేసిన భక్తుల వివరాలను సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు.

Medaram sammakka sarakka prasadam

గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధనలు పెట్టామన్నారు. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష జరిమానా విధిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా,ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

అయితే త్వరలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news