యోగాసనాలలో కొన్ని చూడటానికి చాలా సులభంగా, చిన్నగా అనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి బద్ధకోణాసనం (Baddha Konasana) లేదా బౌండ్ యాంగిల్ పోజ్.ఈ ఆసనం చాలా సులువుగా ఉన్నా ఇది మన శరీరానికి, ముఖ్యంగా కీళ్లు, గర్భకోశానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం. ఈ చిన్న ఆసనం వెనుక దాగి ఉన్న పెద్ద ఆరోగ్య రహస్యం ఏంటి? దీన్ని ఎలా చేయాలి? మరియు దీని వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
బద్ధకోణాసనం పేరులో ‘బద్ధ’ అంటే కట్టబడిన ‘కోణ’ అంటే కోణం ‘ఆసన’ అంటే భంగిమ అని అర్థం. ఈ ఆసనం సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తున్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని సీతాకోక చిలుక ఆసనం అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడం ద్వారా కటి ప్రాంతం మరియు తొడల లోపలి కండరాలు (Inner Thighs) సాగి దృఢంగా తయారవుతాయి.

ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా, మహిళలకు ఇది ఒక వరం లాంటిది. క్రమం తప్పకుండా ఈ ఆసనం సాధన చేయడం వలన రుతుస్రావ సమస్యలు మరియు నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా ఇది గర్భధారణ సమయంలో సులభ ప్రసవానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం, అరికాళ్ల నొప్పిని తగ్గించడం, మరియు శరీరం నుండి ఒత్తిడిని అలసటను దూరం చేయడం దీని ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు. బద్ధకోణాసనం మన మనసును ప్రశాంతంగా ఉంచడానికి మరియు శరీరంలో శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
బద్ధకోణాసనం అనేది కేవలం సాగేందుకు ఉద్దేశించిన ఆసనం మాత్రమే కాదు ఇది అంతర్గత ఆరోగ్యం మరియు సమతుల్యత కోసం ఒక శక్తివంతమైన సాధనం. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఈ ఆసనాన్ని సాధన చేయడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక: మోకాలి లేదా తుంటి కీళ్లలో తీవ్రమైన నొప్పి లేదా గాయాలు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే నిపుణులైన యోగా శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
