నేడు జార్ఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్ష.. బలపరీక్ష ఎదుర్కోనున్న చంపై

-

నేడు జార్ఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్ష ఉండనుంది. ఝార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో ఈ నెల 5వ తేదీన అంటే ఇవాళ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.

Jharkhand Champai Soren to face crucial floor test today, former CM Hemant Soren allowed to join

ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తరలించగా వీరంతా ఇవాళ మధ్యాహ్నం రాంచీకి వెళ్లనున్నారు. ఈ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ పటిష్ఠ భద్రత కల్పించింది.

ఇక అటు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్ఛితి ఏర్పడితే ఎమ్మెల్యే క్యాంపులకు తెలంగాణను వాడుకుంటున్నది కాంగ్రెస్. అలా ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోగానే హైదరాబాద్లో దిగిన 16 మంది బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలింపు చేశారు. ఈనెల 12న బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ బల పరీక్ష. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news