తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి….రాంచీకి బయల్దేరారు.సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ఝార్ఖండ్ లోని రాంచీకి బయల్దేరారు. ఆ ఝార్ఖండ్ రాష్ట్రంలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ‘న్యాయ్ యాత్ర’లో ఆయన పాల్గొననున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉన్నారు.
కాగా, మరోవైపు ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో ఈ నెల 5వ తేదీన అంటే ఇవాళ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తరలించగా వీరంతా ఇవాళ మధ్యాహ్నం రాంచీకి వెళ్లనున్నారు. ఈ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పటిష్ఠ భద్రత కల్పించింది.