తెలంగాణ‌కు రావాల్సిన రూ.1800 కోట్లు విడుదల చేయండి – సీఎం రేవంత్‌

-

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం క‌లిశారు.

Chief Minister Revanth Vinathi to NITI Aayog Vice Chairman Suman Bheri

హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌,ఆరోగ్య‌, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్క‌ర‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙ‌ప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news