200 యూనిట్లు ఫ్రీ కరెంట్.. కిరాయికి ఉండేవారు అర్హులు కాదు ?

-

200 యూనిట్లు ఫ్రీ కరెంట్ గృహ జ్యోతి పథకానికి కసరత్తు షురూ చేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసినట్లు సమాచారం అందుతోంది. వైట్ రేషన్ కార్డ్ ఉంటేనే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకు సిద్ధం అయింది కాంగ్రెస్‌ సర్కార్‌.

ఒక ఇంటికి ఒక మీటరుకే పథకం అమలు చేయనుంది. కిరాయికి ఉండేవారు అర్హులు కాదని సమాచారం. 200 యూనిట్లు లోపు కరెంట్ వాడే గృహ వినియోగదారులు మాత్రమే అర్హులు కానున్నారట. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 2181 యూనిట్ల లోపు వాడకం ఉండాలని పేర్కొందట. గత సంవత్సరం మొత్తం ఓ వినియోగదారుడు 1500 యూనిట్లు వాడితే దానికి 10 శాతం కలిపి 1650 యూనిట్లను 12 నెలలకు విభజించి నెలకు 137 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. ఆ పైన వాడితే బిల్లు లెక్క కడతారని సమాచారం.

అటు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల ఎంపికకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉచిత విద్యుత్ కోసం ఇంటి యజమాని ఆధార్, రేషన్ కార్డులు, ఇతర వివరాలను విద్యుత్ శాఖ ఎంట్రీ చేయనుంది. అటు గ్యాస్ బుక్ చేసినప్పుడు డెలివరీ బాయ్ లబ్ధిదారుల నుంచి ఆధార్, రేషన్ నంబర్లు తీసుకుంటారు. ఏటా 6 సిలిండర్లు రూ. 500 చొప్పున సరాఫరా చేయాలనే ప్రభుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news