స్వతంత్ర భారత్‌లో జన్మించా.. నా ఆలోచనలు అలాగే ఉంటాయి : ప్రధాని మోదీ

-

దేశంలో ప్రతి రంగంలో మహిళలు సత్తా చాటుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని తెలిపారు. అన్ని వర్గాలకు కేంద్ర సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మోదీ ప్రసంగించారు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ నినాదం కాదు.. మోదీ గ్యారంటీ అని ప్రధాని అభివర్ణించారు. తాను స్వతంత్ర భారత్‌లో జన్మించానని అందుకే తన ఆలోచనలు అలాగే ఉంటాయని చెప్పారు.

“ఆదివాసీలు కళాశాలల వరకు వెళ్లలేని పరిస్థితులు ఉండేవి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గాయి.. చేరికలు పెరిగాయి. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ విద్యార్థుల సంఖ్య 44 శాతం పెరిగింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్టీ విద్యార్థుల సంఖ్య 65 శాతం పెరిగింది. ఉన్నత విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థుల సంఖ్య 45 శాతం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసింది.” అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news