తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో సభకు రానున్నారు. డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా….తుంటి గాయం కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు.
దీంతో ఇవాళ అయినా ఆయన సభకు వస్తారా? లేదా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ వస్తే…. సీఎం రేవంత్, కేసీఆర్ మధ్య చర్చ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. మరోవైపు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటోంది.