ఆ హిట్ సిరీస్ సీక్వెల్‌లో నాగచైతన్య, సమంత!

-

ఒకప్పుడు టాలీవుడ్ లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత కూడా వీరిద్దరు కలిస్తే ఎంత బాగుంటుందోనని ఎదురుచూస్తున్న అభిమానులు లేకపోరు. నిజజీవితంలో ఏమో గానీ తెరపై మాత్రం వీళ్లిద్దరు కలిసి నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లే జరగబోతోందా అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

ది బ్యూటీఫుల్ ఆన్‌స్క్రీన్ పెయిర్ చైసామ్‌లు మరోసారి ఓ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేయబోతున్నట్లు ఇప్పుడు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాగచైతన్య దూత వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కు సీక్వెల్ కూడా ఉంటుందని ఆ మధ్య దర్శకుడు క్రిష్ ప్రకటించారు. అయితే ఇప్పుడీ సీక్వెల్లోనే సమంత ఉండబోతుందని కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఇది చూసిన ఫ్యాన్స్ ఇద్దరూ కలిసి నటిస్తే బాగుండు, ఇద్దరు మళ్లీ కలిస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news