హరీష్ రావుది అవగాహన రాహిత్యం : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలు కేసీఆర్, హరీశ్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక ఎక్స్ ఫైర్ మెడిసిన్ అని.. హరీశ్ రావుది అవగాహన రాహిత్యం అని పేర్కొన్నారు. అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాలేదని.. దీంతో ప్రతిపక్ష నేత వైఖరి ఏంటో తెలిసిపోతుందన్నారు. కనీసం బీఏసీ సమావేశానికి కూడా రాలేదని.. ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్ం చేసుకోవాలన్నారు. హరీశ్ రావును సమావేశానికి రాకుండా మేము ఎలా అడ్డుకుంటామని.. బీఆర్ఎస్ కేసీఆర్, కడియం శ్రీహరి హాజరు అవుతారని పేర్లు ఇచ్చినట్టు తెలిపారు. బీఆర్ఎస్ ఇచ్చిన పేర్లలో హరీశ్ రావు పేర్లు లేకపోవడంతో మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారని వెల్లడించారు. రేపు కేసీఆర్ స్థానంలో హిమాన్ష్ కూడా వస్తానంటాడు.. ఎలా అని ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా పని చేసిన హరీశ్ రావుది అవగాహన రాహిత్యం అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news