థియేటర్లో కొట్టుకున్న జగన్, పవన్ ఫ్యాన్స్

-

దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటించిన తాజా చిత్రం యాత్ర 2. ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఇదిలా ఉంటే …ఏపీ ముఖ్యమంత్రి జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ లో దారుణంగా కొట్టుకున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో యాత్ర-2 సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో జగన్, పవన్ అభిమానులు పరస్పరం దాడికి దిగారు. మూవీలో ఓ సీన్ ను ఉద్దేశించి పరస్పర విమర్శలకు దిగగా ఘర్షణ తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రసాట్స్ యాజమాన్యం ఫిర్యాదుతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వల్ గా ఎన్నికల ముందు యాత్ర 2 ను విడుదల చేశారు.ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news