రైలు ఎప్పుడు రిటైర్‌ అవుతుందో తెలుసా..? ఆ తర్వాత దాన్ని ఎలా వాడతారంటే..

-

మనుషులైనా వస్తువులైనా.. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా.. ఒక స్టేజ్ వచ్చేసరికి మూలనపడతాయి. సైకిల్‌ డైలీ వాడితే.. నాలుగేళ్లు వస్తుందేమో, బైక్‌ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయించాలి, కారు కూడా అంతే.. అలా రైలు ఎన్ని ఏళ్లు వస్తుంది.? అంత పెద్ద రైలును ఎన్ని ఏళ్లకు ఒకసారి రిపేర్‌ చేస్తుంటారు. రైలుకు రిటైర్‌ అయ్యే వయసు ఎప్పుడు..?

భారతీయ రైల్వేలు ఆసియాలో రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. దేశంలో రోజూ 23 మిలియన్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్యాసింజర్ రైళ్లలో AC, జనరల్, స్లీపర్ వంటి అనేక రకాల కోచ్‌లు ఉంటాయని మనకు తెలిసిందే. ప్యాసింజర్ రైలు ఎప్పుడు రిటైర్ అవుతుంది.. దాని తర్వాత ఏమి జరుగుతుందో చాలా మందికి తెలియదు.

ICF కోచ్‌ల జీవితకాలం 25 నుండి 30 సంవత్సరాలు. అంటే ఒక ప్యాసింజర్ కోచ్ గరిష్టంగా 25 నుండి 30 సంవత్సరాల వరకు మాత్రమే సేవలు అందిస్తుంది. అయితే, ఈ సమయంలో కూడా ప్రతి 5 లేదా 10 సంవత్సరాలకు ఒకసారి ప్యాసింజర్ కోచ్ మరమ్మతులు చేస్తుంటారు. సాధారణ కోచ్‌కు 25 ఏళ్ల సర్వీసు పూర్తి కాగానే, సర్వీస్ నుంచి విడుదలవుతుంది.. దీని తర్వాత అవి ఆటో క్యారియర్లుగా వాటిని మారుస్తారు.

ఆటో క్యారియర్‌గా మారిన తర్వాత, ఈ రైళ్లు NMG కోచ్‌లుగా మార్చబడతాయి. ప్యాసింజర్ కోచ్‌ను ఎన్‌ఎంజీ కోచ్‌గా మార్చిన తర్వాత మరో 5 నుంచి 10 ఏళ్లపాటు వినియోగిస్తారు. ఈ రైళ్ల ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు రవాణా అవుతాయి. ప్యాసింజర్ కోచ్‌ను NMG కోచ్‌గా మార్చడానికి, కోచ్ పూర్తిగా సీలు చేస్తారు. లోపల సీట్లు తీసేస్తారు. ఫ్యాన్, లైట్ స్విచ్ తీసేస్తారు. కార్లు, మినీ ట్రక్కులు, ట్రాక్టర్లలో సులభంగా లోడ్, అన్‌లోడ్ చేసుకునే విధంగా దీన్ని సిద్ధం చేస్తారు. అలా ఒక రైలును దాని జీవిత కాలం బట్టి వివిధ దశల్లో వాడుతుంటారు. చివరికి అది దేనికి పనికిరాదు అంటే అప్పుడు పక్కనపడేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news