Business Idea : మీరు ఐదు వేల పెట్టుబడితో ఈ వ్యాపారం చేశారంటే.. నెలకు రూ. 20 వేలు సంపాదించవచ్చు

-

వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారా..? పెట్టుబడి తక్కువుగా ఉన్నా సరే.. మంచి లాభాలు పొందే ఏక్‌ధమ్‌ బిజినెస్‌ ఐడియా ఒకటి ఉంది. మీరు ఈ వ్యాపారం చేశారంటే.. లాభాల పంటే. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటంటే.. తేయాకు (టీపొడి) అమ్మకం. దీనికి కేవలం ఐదు వేలు పెట్టుబడి పెడితే చాలు.

ఇండియాలో ఛాయ్‌ లవర్స్‌ ఎక్కువ. రోజుకు కనీసం రెండు మూడు సార్లు తాగుతుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తేయాకు వ్యాపారం జరుగుతుంది. డార్జిలింగ్ ప్రాంతాల్లో పండించే తేయాకు ప్రపంచంలోనే ఉత్తమ, నాణ్యమైన తేయాకు (టీపొడి)గా గుర్తింపు పొందింది. దీనికి భారతదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది. మీరు టీపొడి అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కొన్ని విషయాలను ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది.

టీపొడి వ్యాపారం ఎలా ప్రారంభించాలంటే..

టీపొడి అమ్మే వ్యాపారాన్ని అనేక రకాలుగా ప్రారంభించవచ్చు. మీరు మార్కెట్‌లో టీపొడిని హోటళ్లు, టీస్టాళ్లకు అమ్మవచ్చు. రిటైల్ లేదా హోల్‌సేల్‌లో వ్యాపారం చేయవచ్చు. అనేక పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి, అవి తమ టీపొడిని అమ్మడానికి ఫ్రాంచైజ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తాయి. మీకు ఈ ఫ్రాంచైజీ చాలా తక్కువ బడ్జెట్‌లోనే లభిస్తుంది. మీరు ఆ కంపెనీ టీపొడిని అమ్ముతూ మంచి కమీషన్ పొందవచ్చు. లేదంటే మీరే ఇంటి దగ్గర చక్కగా ప్యాక్ చేసి, డోర్ టు డోర్ డెలివరీ కూడా చేయొచ్చు. మీ టీపొడి తక్కువ ధరకు అమ్మడం వల్ల ప్రజలు ఇష్టపడతారు.

సంపాదన ఎలా ఉంటుంది..

అస్సాం, డార్జిలింగ్ నుంచి మంచి టీపొడి టోకు ధరలలో కేజీ రూ.140 నుంచి 180 వరకు సులభంగా లభిస్తుంది. మార్కెట్‌లో కేజీ 200 నుంచి 300 రూపాయలకు అమ్మవచ్చు. కేవలం 5,000 రూపాయలతో ప్రారంభమయ్యే ఈ వ్యాపారంతో మీరు ప్రతి నెలా 20,000 రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు. మీరు దీన్ని బ్రాండ్‌గా చేయాలనుకుంటే, అందు కోసం మీరు మీ కంపెనీని నమోదు చేసుకోవాలి. అప్పుడు మంచి నాణ్యత గల ప్యాకేజింగ్ కూడా అవసరం. అప్పుడు మీరు మంచి మార్కెటింగ్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు.

మీరు సింపుల్‌గా లూజు టీపొడి అమ్మాలి అనుకుంటే ముందుగా ఇంటి దగ్గర చిన్న ప్రయోగం చెయ్యాలి. ఒకే టీపొడి కాకుండా.. 2 లేదా 3 రకాల టీపొడులను కలిపి.. టీ పెట్టుకొని తాగాలి. టీపొడుల మోతాదులు మార్చుతూ.. టీలు తాగాలి. అప్పుడు మీకు.. ప్రత్యేకమైన మోతాదుల దగ్గర మంచి టేస్ట్ ఉండే టీ తయారవుతుంది. అప్పుడు ప్రతి రోజూ ఆయా టీపొడులను అదే మోతాదులో కలిపి అందరికీ అమ్ముకోవాలి. తద్వారా ఆ టీపొడి కొనేవారికి కూడా టీ బాగా

Read more RELATED
Recommended to you

Latest news