ఓటీటీ ఎంట్రీకి మెగాస్టార్‌ చిరంజీవి రెడీ!

-

ఇప్పుడంతా డిజిటల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. థియేటర్ల కంటే ఓటీటీలకు ప్రేక్షకులు పెరిగిపోయారు. అందుకే చాలా ఓటీటీ సంస్థలు తామే స్వయంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి. మరోవైపు స్టార్ హీరోల నుంచి మెగాస్టార్ల వరకు అంతా ఓటీటీ బాట పడుతున్నారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా నడుస్తోంది. నెమ్మదిగా టాలీవుడ్ కు కూడా పాకింది. ఇటీవలే యంగ్ హీరో నాగచైతన్య దూత వెబ్ సిరీస్ తో డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈ బాటలో మెగాస్టార్ చిరంజీవి కూడా నడవనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్న చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇంత బిజీలోనూ ఆయన ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారట. కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ గతంలో చెప్పినట్టుగానే మంచి స్క్రిప్ట్‌ దొరకడంతో ఇక డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో సందడి చేయాలని గట్టిగానే ఫిక్స్‌ అయినట్టు తాజా అప్‌డేట్‌తో అర్థమవుతోంది. ఇక మెగాస్టార్ ప్రస్తుతం  బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news