NTR కు కూడా భారత రత్న ప్రకటించాలి – విజయశాంతి

-

Bharat Ratna: NTR కు కూడా భారత రత్న ప్రకటించాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ పార్టీ నేత విజయశాంతి. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహా రావు గారిని వరించిందని తెలిపారు. పురస్కారం మన ఆత్మగౌరవ విజయ కేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం అని వివరించారు.

Bharat Ratna should also be announced to NTR said Vijayashanti

ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోందన్నారు విజయశాంతి. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను.అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం అని తెలిపారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news