రోజుకు కనీసం 40-60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.. అలాగే అధిక బరువు పెరగకుండా చూడ్డానికి అందంగా కనిపిస్తారు.. కానీ వ్యాయామం చేసిన తర్వాత… బాడీ చాలా అలిసిపోతుంది. నీరసంగా అనిపిస్తుంది. బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. కండరాల నొప్పులు అధికంగా ఉంటాయి. ఇవి అన్నీ సాధారణం అయినప్పటికీ.. వీటి నుంచి ఉపశమనం పొందడం అవసరం. లేదంటే..మీరు యాక్టివ్‌గా మళ్లీ మరుసటి రోజు వ్యాయామం చేయలేరు. ఈ నొప్పులతో చేయబుద్ధి కాదు. ఈ నొప్పులకు తగ్గించుకోవడానికి ఏం చేయాలో చూద్దాం..
వ్యాయామం నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి విశ్రాంతి ముఖ్యం. మీరు చాలా శ్రమతో కూడిన వ్యాయామం చేసినట్లయితే, అలసిపోయిన కండరాలకు విశ్రాంతి ఇవ్వండి, లేకుంటే అవి దెబ్బతినవచ్చు. వ్యాయామం తర్వాత బాడీని సాగదీయడం కూడా దీనికి మంచి మార్గం. స్ట్రెచింగ్ శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. రక్త ప్రసరణను పెంచడం ద్వారా శరీరంలో నొప్పిని తగ్గిస్తుంది.
ఐస్ ప్యాక్ వాపును తగ్గిస్తుంది. వెచ్చని కంప్రెస్ రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ విధానం నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా, మసాజ్ వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
హైడ్రేటెడ్‌గా ఉండటం ద్వారా మాత్రమే కండరాల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ కారణంగా, నీరు, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు పుష్కలంగా త్రాగాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు కండరాల నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ కారణంగా మీరు కండరాల పునరుద్ధరణ కోసం వాటిని తీసుకోవాలి.
శరీరంలో విపరీతమైన నొప్పి ఉంటే, నొప్పి నివారణలు తీసుకోవచ్చు. అయితే, నొప్పి పెరిగితే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. ఇది శక్తి స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. శరీరంలోని అన్ని సమస్యలను నయం చేస్తుంది. తేలికపాటి వ్యాయామం కూడా నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది కండరాలలో మంచి రక్త ప్రసరణను పెంచుతుంది.
వ్యాయామం తర్వాత పర్టిక్యులర్‌గా ఒక పార్ట్ మీద నొప్పి ఉంటే.. మీరు ఆ పార్ట్‌కు సంబంధించిన వ్యాయామం చేసి ఉంటే.. తేలికపాటి నొప్పిని భరించవచ్చు..స్క్వాట్స్ చేసినప్పుడు తొడలు నొప్పులు వస్తాయి.. వాటిని మీరు అలా వదిలేయండి.. మరుసటి రోజు కూడా చేస్తే.. అవి ఆటోమెటిక్‌గా తగ్గుతాయి..ఆ నొప్పులు మంచివే. మీ కొవ్వు కదలడం మొదలువుతుంది..అందుకే నొప్పులు వస్తాయి..కానీ నొప్పి ఎక్కువగా ఉందా..? తట్టుకోలేనంత వస్తుందా అని మీరే గమనించుకోవాలి..!