ఛలో నల్లగొండ బహిరంగ సభకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ హాజరు కానున్న సభకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు జిల్లా ఎస్పీ చందనా దీప్తి. సభా సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పెట్టుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రెచ్చగొట్టే, ఆవేశపూరిత ప్రకటనలు, ప్రసంగాలు ఉండకూడదని… వ్యక్తిగత ప్రవర్తనపై ఎలాంటి దాడులు ఉండకూడదని వివరించారు. షరతులకు విరుద్ధంగా వ్యవహారిస్తే సభకు ఇచ్చిన అనుమతి రద్దు చేయబడును, నిర్వహాకులను ప్రాసిక్యూట్ చేయబడునని… సాధారణ ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించరాదని తెలిపారు. డ్యూటీలో ఉన్న ఏ పోలీసు అధికారైనా కోరినప్పుడు అనుమతి లేఖ సమర్పించాలని..టపాసులు కాల్చడానికి అనుమతి లేదన్నారు.
సూచించిన స్దలాల్లోనే వాహానాలను పార్కింగ్ చేసుకోవాలని ఆదేశించారు పోలీసులు.