బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

-

మరికొద్ది నిమిషాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలిపింది. పద్దు ప్రాధాన్యాలు, కేటాయింపుల గురించి చర్చించారు.

ఇతర అంశాలపై కూడా కేబినేట్ భేటీలో చర్చలు జరిపినట్లు సమాచారం. బీఆర్ఎస్కు దీటుగా సమాధానం చెప్పడం, నల్గొండలో ఆ పార్టీ సభ తలపెట్టిన నేపథ్యంలో అధికార పక్షంగా ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మేడిగడ్డ ఆనకట్టపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నివేదిక, సంబంధిత అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని సమాచారం. బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news