తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు కౌన్సిర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఇలా పార్టీలను మారుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది.ఇప్పటికే నల్లగొండ మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తాజాగా కోదాడ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టగా.. అందులో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చైర్మన్ గా ఎంపికవ్వడం విశేషం.
ఇదిలా ఉంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం అయింది. మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలం కాటారంలో సింగిల్ విండో చైర్మన్ చల్లా నారయణ రెడ్డి పై అవిశ్వాసానికి తెరలేపారు డైరెక్టర్లు. సింగిల్ విండో 13 మంది డైరెక్టర్లలో, 11 మంది క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన డైరెక్టర్లు శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.సోమవారం అవిశ్వాస నోటిస్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.