కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. శనివారం అసెంబ్లీ లో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుతుల రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండాల్సిందని అన్నారు.
అయితే నీటిపారుదులు నిపుణులు సూచనలు పట్టించుకోకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు భట్టి. నీటిపారుదలపై శ్రద్ధ వహిస్తే పదేళ్లలో అద్భుతం జరుగుతుందని అన్నారు కానీ గత ప్రభుత్వం ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసిందని అన్నారు భట్టి కాంట్రాక్టుల కోసం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారిందని అన్నారు. లక్షల కోట్ల రూపాయల ఖర్చులు అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు.