హాలీవుడ్​ రేంజ్ ​లో ‘కల్కి BGM’.. నెట్టింట మరో అప్డేట్ ట్రెండింగ్

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లేటెస్ట్ మూవీ  ‘కల్కి 2898’ AD. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరో అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్​ నారాయణన్ ప్రభాస్ ఫ్యాన్స్​కు కల్కితో గ్రాండ్​ ట్రీట్ ఇవ్వనున్నారట. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్​లో బ్యాక్ గ్రౌండ్​ స్కోర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ థీమ్ మ్యూజిక్ కంపోజ్ చేశారట. శనివారం రోజున చెన్నైలో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో ఈ థీమ్ ప్లే చేశారు.

ఈ థీమ్ మ్యూజిక్ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాలో బీజీఎం అదిరిపోద్దని అంటున్నారు. ఈ కాన్సర్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.  ఈ థీమ్ అండ్ బీజీఎమ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్​ నారాయణన్ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా గురించి చెప్పుకుంటే.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్​లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్​ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటానీ, కోలీవుడ్ స్టార్ హీరో కమల్​ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news