తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 44 నుంచి 46 ఏళ్లకు వయోపరిమిత పెంపు

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంచుతూ అసెంబ్లీలో ప్రకటన చేసింది. 44 నుంచి 46 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం..ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. రెండేళ్ల పాటు అమలు చేయనున్నట్లు తెలిపింది.

గత ప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు (10 సంవత్సరాలు) పెంచగా.. ఈ ప్రభుత్వం రెండు యేళ్లు పెంచింది.  ఇక అటు మేడిగడ్డపై కాంగ్రెస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మేడిగడ్డకు రావాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్‌ సర్కార్‌ లేఖ రాసింది. రేపు మేడిగడ్డ సందర్శనకు రావల్సిందిగా బీఆర్ఎస్, బిజెపి,ఏంఐఎం, సీపీఐ పార్టీ అధ్యక్ష్యులకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news