తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు సోమవారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు తెలంగాణ మలిదశ ఉద్యమానికి కారకులం అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాగాంధీని కోరారని చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు కెసిఆర్ కి తెలంగాణ తో సంబంధమే లేదని అన్నారు తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీని కెసిఆర్ కూడా అన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో హరీష్ రావుకి పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టి దొరకలేదని అన్నారు.