రాజ్యసభకు సోనియా.. లోక్ సభ ఎన్నికలకు దూరం…..!

-

కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఈ లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నారట. ఆమెను నేరుగా రాజ్యసభకు కాంగ్రెస్ నామినేట్ చేయనుందట. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారని తెలుస్తోంది. కాగా రెండు దశాబ్దాలుగా సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. అలాగే సైయర్ నసీర్ హుస్సేన్‌కు కూడా తిరిగి టిక్కెట్ ఇస్తారని, అజయ్ మాకెన్‌కు కూడా రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు గత జనవరి 29న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగ …..అదే రోజు లెక్కింపు కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news