మరికొద్ది రోజుల్లో భారత్ లో బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. గంటకు గరిష్ఠంగా 320 కి.మీల మెరుపు వేగంతో రెండు గంటల్లో 508 కిలో మీటర్లు ప్రయాణించే ఈ రైలును కేంద్రం అందుబాటులోకి రానుంది. ‘ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ విశేషాలతో కూడిన వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. మోదీ సర్కార్ కలలు కాదు.. వాస్తవాలను సృష్టిస్తోందని క్యాప్షన్ ఇచ్చారు. ఇంకా ప్రధాని మోదీ 3-0 అంటూ మూడోసారి పాలనలో ‘బుల్లెట్ రైలు’ కోసం ఎదురుచూడండంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీన్ని భారత భవిష్యత్తుగా పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి స్లాబ్ ట్రాక్ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే గుర్తించే ఏర్పాట్లు, 28 స్టీలు వంతెనలు, ఏడు సొరంగాలు, సముద్రగర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వేస్టేషన్లు తదితర విశేషాలను షేర్ చేశారు. ప్రాజెక్టు వ్యయం దాదాపు 1.08 లక్షల కోట్లు. తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
सपने नहीं हकीकत बुनते हैं!
Stay tuned for #BulletTrain in Modi 3.0!#ModiKiGuarantee pic.twitter.com/0wEL5UvaY8— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 12, 2024