ఢిల్లీలో రైతుల నిరసన ఎఫెక్ట్ …..బీజేపీ ఏయే పంటకు ఎంత మద్దతు ధర పెంచింది..?

-

కనీస మద్దతు ధర కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ వైపు ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో వచ్చే ప్రయత్నం చేయగా బారికేడ్లు, ముళ్ల కంచెల సాయంతో పోలీసులు, కేంద్ర బలగాలు వీరిని అడ్డుకున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం పలు పంటలకు మద్దతు ధరల్ని ఎంతమేర పెంచామనేది సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బీజేపీ హయాంలో రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందని, రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే మోడీ నినాదంతో, గత 10 సంవత్సరాలలో రైతుల శ్రేయస్సుకోసం కనీస మద్దతు ధర గణనీయంగా పెంచినట్లు వెల్లడించారు.

 

ఇక  కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో (2013-14), బీజేపీ పాలన(2023-24)లో ధరలను పోల్చారు.

 

జొన్నలు:

2014-15లో మద్దతు ధర: రూ. 1500

2023-24లో మద్దతు ధర: రూ. 3180

 

శనిగలు:

2014-15లో మద్దతు ధర: రూ. 3100

2023-24లో మద్దతు ధర: రూ. 5230

 

వరి:

2014-15లో మద్దతు ధర: రూ. 1310

2023-24లో మద్దతు ధర: రూ. 2183

 

గోధుమ:

2014-15లో మద్దతు ధర: రూ. 1350

2023-24లో మద్దతు ధర: రూ. 2275

 

మొక్కజొన్న:

2014-15లో మద్దతు ధర: రూ. 1310

2023-24లో మద్దతు ధర: రూ. 2090

 

సజ్జలు:

2014-15లో మద్దతు ధర: రూ. 1250

2023-24లో మద్దతు ధర: రూ. 2500

 

మసూర్ దాల్:

2014-15లో మద్దతు ధర: రూ. 2950

2023-24లో మద్దతు ధర: రూ. 6425

 

రాగి:

2014-15లో మద్దతు ధర: రూ. 1500

2023-24లో మద్దతు ధర: రూ. 3846

Read more RELATED
Recommended to you

Latest news