కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కామాంధులు లా విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాజధాని రాంచీలో నవంబర్ 26న సాయంత్రం 5:30 గంటల సమయంలో ఓ ఎల్ఎల్బీ స్టూడెంట్.. తన ఫ్రెండ్‌తో కలిసి ఉంది. అదే సమయంలో అక్కడకు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గన్‌పాయింట్‌లో బెదిరించి ఆమెను లాక్కెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో.. తన స్నేహితులకు దుండగులు ఫోన్ చేశారు. ఆ తర్వాత కారులో వచ్చిన కొందరు, వీరిద్దరూ కలిసి ఆ యువతిని బ్రిక్ కిల్న్ ఏరియాకు తీసుకెళ్లారు.
అక్కడ మొత్తం 12 మంది కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసిన దుండగులు పారిపోయారు. స్నేహితుడి సహకారంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న యువతి ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి కారు, బైక్, తుపాకీ, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన జార్ఖండ్‌లో సంచలనంగా మారింది.