దిల్లీ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’ నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరింది. మంగళవారం అర్ధరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన రైతులు ఇవాళ మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
మరోవైపు ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై కందకాలు తవ్వారు. ఇంకోవైపు దిల్లీలో 144 సెక్షన్ అమలు, రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు నేపథ్యంలో వాహనదారులు తిప్పలు పడుతున్నారు.
ఇంకోవైపు మంగళవారం రోజున దిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు రాత్రంతా రోడ్లపైనే గడిపి ఇవాళ ఉదయాన్నే టీ, అల్పాహారాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా.. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
VIDEO | Farmers prepare food at Shambhu border on day 2 of their 'Delhi Chalo' march. pic.twitter.com/u3JXihnAMk
— Press Trust of India (@PTI_News) February 14, 2024